JN: బచ్చన్నపేట మండలంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉత్సవాలను ఈనెల 10 నుంచి 17 వరకు విజయవంతం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి వెంకటేశ్ పిలుపునిచ్చారు. బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తోందని విమర్శించారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
'రైతాంగ పోరాట ఉత్సవాలను జయప్రదం చేయాలి'


