హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలి'

నాగర్‌కర్నూల్ నుంచి తెలకపల్లికి మంతటి, అనంతసాగర్, బండపల్లి, దాసుపల్లి మీదుగా బస్సులు లేక విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చదువులు, పనుల కోసం వెళ్లేవారు మెయిన్‌ రోడ్డుకు నడుచుకుంటూ రావాల్సి వస్తోందని వాపోతున్నారు. సమయం, డబ్బు వృథా అవుతున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి ఈ మార్గంలో బస్సులు నడపాలని కోరుతున్నారు.