NDL: బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు 100 మంది గర్భిణీ స్త్రీలకు ఉచిత పౌష్టికాహారాన్ని డాక్టర్లు పంపిణీ చేశారు. బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరమ్మ తన సొంత నిధులతో పౌష్టికాహారాన్ని అందజేస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్యమే తమ లక్ష్యమని డాక్టర్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
100 మంది గర్భిణీలకు ఉచిత పౌష్టికాహారం!


