MDCL: ఆడ శిశువులపై వివక్షకు కారణమయ్యే లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మేడ్చల్ జిల్లా DMHO డా. కె. ఆనంద్ హెచ్చరించారు. రాష్ట్ర స్థాయి PCPNDT టాస్క్‌ఫోర్స్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రుల్లో తనిఖీలు చేపట్టారు. రాబోయే నెల రోజుల పాటు తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తెలంగాణ
లింగ నిర్ధారణపై DMHO హెచ్చరిక


