హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలల్లో తెలంగాణ భాషా దినోత్సవం

SDPT: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, కవితా పోటీలు నిర్వహించి, తెలంగాణ భాష, యాస, సంస్కృతి విశిష్టతను వివరించారు. కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన సాహిత్య సేవలను స్మరించుకున్నారు.