హైదరాబాద్: 28°C
తెలంగాణ

కూలీల ట్రాక్టర్ బోల్తా..!

BDK: పాల్వంచ గ్రామీణ పరిధిలోని సత్యనారాయణపురం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. కలుపు తీసే పనుల కోసం 13 మంది కూలీలు ట్రాక్టర్‌పై వెళ్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌లో ఉన్న 13 మంది కూలీలకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.