హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజాకవి కాళోజీ నేటి తరానికి ఆదర్శం: కలెక్టర్

NRPT: నారాయణపేట కలెక్టరేట్‌లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ప్రియాంక పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాళోజీ తన రచనలతో ప్రజల్లో సామాజిక చైతన్యం నింపారని, తెలంగాణ భాషా సంస్కృతుల పరిరక్షణకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.