హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆన్ లైన్ ప్రక్రియను జాప్యం లేకుండా పూర్తి చేయాలి'

కృష్ణా: నందివాడ (మం) ఇలపర్రు గ్రామ సచివాలయాన్ని డిప్యూటీ ఎంపీడీవో సుబ్రహ్మణ్యం బుధవారం సందర్శించారు. సచివాలయ సిబ్బంది నిర్వహిస్తున్న పింఛన్ దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియను పరిశీలించారు. కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలన్నారు.