SDPT: అసెంబ్లీలో 6 గ్యారంటీలపై ప్రశ్నించినందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం పిరికిపంద చర్య అని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు అన్నారు. బుధవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై చర్చించే అసెంబ్లీ నుంచి ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి, చర్చలు ఎవరితో జరుపుతారని ప్రశ్నించారు.
తెలంగాణ
ఎమ్మెల్యేల సస్పెన్షన్ పిరికిపంద చర్య


