హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

MBNR: మిడ్జిల్ మండలం రాణిపేట-వసుపుల ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తూరుకు చెందిన ఆంజనేయులు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం ఆయన బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది గణేష్, హేమలత వెంటనే స్పందించి క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను జిల్లా ఆసుపత్రికి తరలించారు.