హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక: కలెక్టర్

కరీంనగర్ జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. మానేరు జలాశయం, ఇల్లందకుంట ఆలయం, ఎలగందుల కోట, బొమ్మలమ్మ గుట్ట, నగునూరు ప్రాంతాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, సీసీ కెమెరాలు, ఫుడ్ కోర్టులు, రహదారులు ఏర్పాటు చేస్తామన్నారు. సర్వాయిపేట పాపన్న గుట్ట, మానేరు రివర్ ఫ్రంట్ పనులు జరుగుతున్నాయన్నారు.