హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాల్యవివాహాలపై కఠిన చర్యలు

BDK: బాల్యవివాహాలు నిర్వహించినా, సహకరించినా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. బాల్యవివాహ నిరోధక చట్టంతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. బాల్యవివాహాల సమాచారం తెలిసిన వెంటనే 1098, డయల్‌ 100 లేదా జస్ట్ రైట్స్ సంస్థకు తెలియజేయాలని సూచించారు.