హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జిల్లాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి'

ADB: జిల్లాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ సూచించారు. బుధవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. పర్యాటక ప్రాంతాల్లో తాగునీరు, రవాణా, మరుగుదొడ్లు, సీసీ కెమెరాలు, భద్రతా వసతులు మెరుగుపరచాలని వాణి ప్రసాద్ ఆదేశించారు.