హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్పంచుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతి

HNK: గ్రామ పంచాయతీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా సర్పంచులు హన్మకొండ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఉప సర్పంచుల చెక్‌ పవర్‌ రద్దు చేయాలని, స్టాంప్‌ డ్యూటీ, సీనరేజ్‌ ఛార్జీల ఆదాయాన్ని పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్‌ చేశారు. సర్పంచుల గౌరవ వేతనాన్ని పెంచాలని, హౌస్‌ నంబర్లు, నిర్మాణ అనుమతుల బాధ్యతలను పంచాయతీలకే అప్పగించాలని కోరారు.