హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దసరా నాటికి గృహప్రవేశాలే లక్ష్యం'

విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పి.జి.వి.ఆర్ నాయుడు (గణబాబు) బుధవారం అచ్చెన్నాయుడులోవ టిడ్కో లేఅవుట్లో 260 మంది లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేశారు. మిగిలిన ఇళ్లను దశలవారీగా పంపిణీ చేసి, దసరా నాటికి గృహప్రవేశాలు పూర్తి చేస్తామన్నారు. కాలనీలో రూ.13 కోట్లతో ఘాట్ రోడ్డు, బస్టాప్లతో పాటు అంగన్వాడీ, పాఠశాల వంటి మౌలిక వసతుల కల్పిస్తున్నామన్నారు.