హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ సుబ్రాహ్మణ్య స్వామి దేవస్థానంలో అన్నదానం

విజయనగరం స్థానిక గూడ్స్ షెడ్ వద్ద వేంచేసియున్న శ్రీ సుబ్రాహ్మణ్య స్వామి దేవస్థానం వద్ద బుధవారం మాస శివరాత్రి పురస్కరించుకుని భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెలా వచ్చే మాస శివరాత్రి పర్వదినాన ఆలయంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ చేయడం ఒక ఆనవాయితిగా వస్తోందని ఈవో వెంకటరమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.