W.G: ఆకివీడు శాలిపేటలో రేషన్ షాప్ బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ కే.ఆర్. కల్పశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ షాపులో ప్రజలకు అందిస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీ తీరును, స్టాక్ వివరాలను, సంబంధిత రికార్డులను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. షాపులో అందుబాటులో ఉన్న సరుకుల నిల్వలు, ఇప్పటివరకు లబ్ధిదారులకు పంపిణీ చేసిన సరుకుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
రేషన్ షాపు తనిఖీ చేసిన జేసీ కల్పశ్రీ


