HNK: జిల్లాలో సమగ్ర మౌలిక సదుపాయాలతో ఐటీ టవర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఛాహత్ బాజ్‌పాయ్‌కు మరోసారి వినతిపత్రం అందజేశారు. జూన్ 4, ఆగస్టు 12న ఇదే అంశంపై వినతులు ఇచ్చినట్లు వరంగల్ ఐటీ హబ్స్ యూనిటీ ప్రెసిడెంట్ భార్గవ్ బూరా తెలిపారు. ఇప్పటికే ఉన్న ఐటీ కంపెనీలను కొనసాగించడంతో పాటు కొత్త పెట్టుబడులను ఆకర్షించాలని, తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు.
తెలంగాణ
'హనుమకొండలో ఐటీ టవర్ ఏర్పాటు చేయాలి'


