హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు అరెస్ట్ అక్రమం: కుడా ఛైర్మన్

KRNL: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అక్రమాలు జరగకపోయినా రాజకీయ కక్షతో చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి 53 రోజులు రాజమండ్రి జైలులో ఉంచారని కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఈ వేధింపులకు ప్రజలు 2024 ఎన్నికల్లో వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసి సమాధానం చెప్పారని పేర్కొన్నారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని ప్రజల తీర్పుతో జగన్‌కు అర్థమైందన్నారు.