హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక నిమజ్జన ఏర్పాట్లపై పరిశీలన

కడపలో వినాయక నిమజ్జన ఏర్పాట్లను నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ పీ. భవాని ప్రసాద్, ఆర్డీవో, ఇరిగేషన్, కేసీ కెనాల్ అధికారులు బుధవారం పరిశీలించారు. దేవుని కడప చెరువు, దుర్గమ్మ గుడి, ఇర్కాన్ సర్కిల్, ఫాతిమా కళాశాల సమీపంలోని నిమజ్జన ప్రాంతాలను సందర్శించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు, ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.