హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలి'

JN: వినాయక చవితి, గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. వినాయక చవితి సందర్భంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిమజ్జన ఘాట్ల వద్ద పటిష్ఠ బందోబస్తు, బారికేడింగ్, బోట్లు, గజ ఈతగాళ్లు, వైద్య బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మట్టి గణపతులను పూజించాలని తెలిపారు.