ADB: నేరడిగొండ మండలంలోని బోరిగాం గ్రామ శివారులో పత్తి పంట మధ్య అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న ఆడే కపిల్‌ను అరెస్టు చేసినట్లు సీఐ రమేష్ బుధవారం తెలిపారు. నిందితుడి నుంచి రూ.12.50 లక్షల విలువైన 125 గంజాయి మొక్కలు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతోనే ఈ సాగు చేసినట్లు సీఐ రమేష్ పేర్కొన్నారు.
తెలంగాణ
పత్తి పంటలో గంజాయి సాగు.. 125 గంజాయి మొక్కలు స్వాధీనం


