VSP: తొలి ఏపీ రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీల్లో విశాఖ రేంజ్ పోలీసులు సత్తా చాటారు. సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు గుంటూరు, మంగళగిరిలో జరిగిన పోటీల్లో 338 పతకాలు సాధించి ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచారు. ఇందులో 197 స్వర్ణాలు, 82 రజతాలు, 59 కాంస్యాలు ఉన్నాయి. ప్రతిభ కనబరిచిన సిబ్బందిని రేంజ్ ఐజీ గోపినాథ్ జెట్టి బుధవారం అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖ రేంజ్ పోలీసుల ఘన విజయం


