సౌత్ జోన్, ఈస్ట్ జోన్ జట్ల మధ్య జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం కనిపిస్తోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ 584 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. ఇషాన్ కిషన్ 80 పరుగులు చేసి ఔటయ్యాడు. రేపు చివరి రోజు కావడంతో మ్యాచ్ ఫలితం తేలే అవకాశం కనిపించడం లేదు. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా ఈస్ట్ జోన్‌ను విజేతగా ప్రకటించనున్నారు.
క్రీడలు
దులీప్ ట్రోఫీ: ముగిసిన నాలుగో రోజు ఆట


