హైదరాబాద్: 28°C
క్రీడలు

ఈస్ట్ జోన్ విజయం లాంఛనమే

సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ గెలుపు లాంఛనప్రాయంగా మారింది. సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకే ఆలౌట్ కావడంతో, ఈస్ట్ జోన్ ఏకంగా 372 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. మ్యాచ్‌కు రేపే చివరి రోజు కావడంతో ఫలితం డ్రాగా ముగిసే అవకాశం ఉంది. అయితే, తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా ఈస్ట్ జోన్ విజేతగా నిలవడం లాంఛనమే కానుంది.