హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వశిష్ఠ గోదావరి వారధిపై ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాం'

W.G: చించినాడ వశిష్ఠ గోదావరి వారధిని మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల చించినాడ వారధి ఆత్మహత్యలకు వేదికగా మారుతోందన్నారు. వాటిని నివారించేందుకు వారధికి ఇరువైపులా 2.4 కిలోమీటర్ల మేర రక్షణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎంత ఖర్చయినా విషాదాలకు తావులేకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని అన్నారు.