జపాన్‌లోని నగోయా నగరంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. దీంతో వరద నీరు నగరాన్ని చుట్టుముట్టింది. సెప్టెంబర్ 19 నుంచి ఇక్కడ ఆసియా క్రీడలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ వరదలు తీవ్ర ఆందోళన కలిగించాయి. అయితే, క్రీడాకారులు, సహాయక సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని నగోయా సిటీ మేయర్ స్పష్టం చేశారు. ఎలాంటి ఆందోళన వద్దని, షెడ్యూల్ ప్రకారమే ఆసియా గేమ్స్ జరుగుతాయని వెల్లడించారు.
క్రీడలు
ఆసియా గేమ్స్ వేళ జపాన్‌లో వరదలు


