హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా కప్: సెమీస్ షెడ్యూల్ ఖరారు

మహిళల టీ20 ఆసియా కప్ తుది దశకు చేరుకుంది. భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి. రేపు రాత్రి 8 గంటలకు జరిగే తొలి సెమీస్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఈ నెల 11న జరిగే రెండో సెమీస్‌లో శ్రీలంక, పాకిస్తాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. గెలిచిన జట్లు ఈ నెల 13న జరిగే ఫైనల్‌లో తలపడనున్నాయి.