హైదరాబాద్: 28°C
తెలంగాణ

లోకమాత ఆలయంలో ప్రత్యేక పూజలు

జగిత్యాల జిల్లా కేంద్రం 50వ వార్డులోని శ్రీ లోకమాత ఆలయంలో మహిళలు బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా మహిళలు కుంకుమ పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, కౌన్సిలర్ లావణ్య మహేష్, మాజీ కౌన్సిలర్లు లలిత, రాజేందర్, చారి పాల్గొన్నారు.