హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇండోర్ స్టేడియంలో మెరుగైన వసతులు: కలెక్టర్

GDWL: గద్వాల ఇండోర్ స్టేడియంలో క్రీడాకారులకు ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. బుధవారం స్టేడియాన్ని తనిఖీ చేసిన ఆయన బ్యాడ్మింటన్ కోర్టులో సింథటిక్ మ్యాట్, సరైన లైటింగ్, పారిశుద్ధ్యంపై అధికారులకు మార్గదర్శకాలు ఇచ్చారు. గోడలపై ప్రముఖ క్రీడాకారుల చిత్రాలు, పెయింటింగ్స్ ఏర్పాటు చేయాలన్నారు.