హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

BDK: సివిల్స్ అభ్యర్థులకు రాజేంద్రనగర్‌ గిరిజన IAS స్టడీసర్కిల్‌లో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నట్లు ITDA PO రాహుల్ తెలిపారు. వార్షికాదాయం రూ.3 లక్షల్లోపు ఉన్న SC, ST, BC అభ్యర్థులు ఈ నెల 23లోగా welfare.sriramsias.comలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు.