హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'లైసెన్సుల రెన్యువల్‌ రద్దు చేయాలి'

ASR: ఏజెన్సీ ప్రాంతాల్లో మద్యం దుకాణాల పాత లైసెన్సుల రెన్యువల్‌ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘం కూనవరం మండల కార్యదర్శి తెల్లం తమ్మయ్య డిమాండ్‌ చేశారు. రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌, 1/70 చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా లైసెన్సులు రెన్యువల్‌ చేయడం సరికాదన్నారు. మద్యం దుకాణాల అనుమతుల్లో గ్రామసభల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.