హైదరాబాద్: 28°C
తెలంగాణ

గవర్నర్‌ను కలిసిన సంస్కార భారతి

HYD: నగరంలోని లోక్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను సంస్కార భారతి తెలంగాణ ప్రాంత్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కే.కే.వీ. శర్మ ఇతర ప్రతినిధులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై గవర్నర్‌తో చర్చించారు. సంస్కార భారతి కార్యకలాపాలు, సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలను ప్రతినిధులు గవర్నర్‌కు వివరించారు.