SRPT: మేళ్లచెరువు శివారులోని ముత్యాల బ్రాంచ్ కెనాల్ ర్యాంపు వద్ద ప్రమాదవశాత్తు కాలువలో పడి వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బక్కమంతులగూడెంకు చెందిన యేసు ఇవాళ బంధువులతో కలిసి చేపలు పట్టేందుకు వెళ్లాడు. వల నీటిలో చిక్కుకోవడంతో బయటకు తీసేందుకు కాలువలో దిగగా, నీటి ప్రవాహానికి జారిపడి మృతి చెందాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
కాలువలో పడి వ్యక్తి మృతి


