హైదరాబాద్: 28°C
తెలంగాణ

కంటోన్మెంట్‌లో సీసీ రోడ్లకు శంకుస్థాపన

MDCL: మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని కంటోన్మెంట్‌లో ఎస్‌బీఐ కాలనీ, చందులాల్ బౌలి, జయనగర్ కాలనీల్లో రూ.59 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఎంపీ ఈటల రాజేందర్ శంకుస్థాపన చేశారు. కంటోన్మెంట్ బోర్డు నిధులతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీగణేష్, బోర్డు సభ్యులు బానుక నర్మద, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.