హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యుత్ సమస్యలు పరిష్కరించండి'

HNK: ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని బుధవారం బీజేపీ మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ అన్నారు. గ్రామానికి ప్రస్తుతం ఉన్న 33KV విద్యుత్ సరఫరాకు ప్రత్యామ్నాయ లైన్ లేకపోవడంతో, చిన్న సాంకేతిక సమస్య వచ్చిన గ్రామంలో విద్యుత్ సరఫర నిలిచిపోతోందన్నారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని విద్యుత్ అధికారులకు వినతిపత్రం అందచేశారు.