హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరుడుగట్టిన దొంగ అరెస్ట్

SRPT: కోదాడలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న కరుడుగట్టిన దొంగ పట్నం శెట్టి రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి రూ.60 లక్షల విలువైన 37.2 తులాల బంగారం, 470 గ్రాముల వెండి, రూ.3.60 లక్షల నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. HYDకు చెందిన నిందితుడు డ్రైవర్‌గా పనిచేస్తూ సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ నేరాల బాట పట్టాడని ఎస్పీ నరసింహ తెలిపారు.