హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్షాలు లేక ఎండుతున్న పంటలు

NGKL: కల్వకుర్తి మండలంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. తోటపల్లి, బెక్కర తదితర గ్రామాల్లో రైతులు పత్తి పంట వరి పంట సాగు చేశారు. దాదాపు మూడు నెలల నుంచి వర్షాలు ముఖం చాటేయడంతో పంటలు ఎండిపోతున్నాయి. నీటివసతులు ఉన్న రైతులు స్ప్రింకర్లతో పంటను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. నీటి వనరులు లేని రైతులు వర్షాలు కురవాలని ఆకాశం వైపు దీనంగా ఎదురుచూస్తున్నారు.