హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖో-ఖో పోటీలకు 12 మంది ఎంపిక..!

KMM: కల్లూరు మినీ స్టేడియంలో జిల్లా ఖో-ఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలను ఘనంగా నిర్వహించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి 123 మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు పాల్గొనగా, 24 మంది పీడీలు, పీఈటీల పర్యవేక్షణలో జరిగిన ఈ ఎంపికల్లో 12 మంది బాలురను 'ఖేలో ఇండియా' జిల్లా జట్టుకు ఎంపిక చేశారు.