హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాండూరులో అధ్వానంగా పారిశుద్ధ్యం

VKB: జిల్లాలోని తాండూరు పట్టణంలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. రహదారుల పక్కన చెత్తకుప్పలు పేరుకుపోవడంతో పాటు డ్రైనేజీలు పూడుకుపోయాయి. దీంతో దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమలు విస్తరిస్తున్నాయి. ప్రధాన రహదారిపై చెత్త పేరుకుపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో అధికారులు తక్షణమే పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.