హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీటీడీ బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల

TPT: శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలు-2026 బుక్లెట్‌ను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, బోర్డు సభ్యులు బుధవారం ఆవిష్కరించారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. వాహన సేవలు, విశేష ఉత్సవాల వివరాలతో బుక్లెట్‌ను రూపొందించారు.