హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సెల్ టవర్ నిర్మాణ పనులు నిలిపివేయాలి'

AKP: సెల్ టవర్ నిర్మాణ పనులు నిలిపివేయాలని పాయకరావుపేట పట్టణంలోని షీలానగర్, ధనిశెట్టి నగర్, బృందావనం, ప్రశాంతినగర్‌ కాలనీవాసులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో రెండు టవర్లు ఉన్నాయన్నారు. మరో టవర్‌ నిర్మించవద్దని డిమాండ్‌ చేశారు. రేడియేషన్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.