SRPT: అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో అమరవరం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రానికి ఇంటి యజమాని తాళం వేసినట్లు సమాచారం. దీంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందాల్సిన గుడ్లు, బాలామృతం వంటి పౌష్టికాహారం పంపిణీ నిలిచిపోయింది. అధికారులు వెంటనే స్పందించి అద్దె బకాయిలు చెల్లించి కేంద్రాన్ని పునఃప్రారంభించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తెలంగాణ
అంగన్‌వాడీ కేంద్రానికి తాళం


