హైదరాబాద్: 28°C
తెలంగాణ

మట్టి గణపతులకే సైబరాబాద్ పిలుపు

RR: వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో పాటు పర్యావరణహితంగా జరుపుకోవాలని సైబరాబాద్ అధికారులు పిలుపునిచ్చారు. జలవనరులు, జలచరాలకు హాని కలగకుండా సహజసిద్ధమైన మట్టి గణపతులను మాత్రమే ప్రతిష్టించాలని సూచించారు. సంప్రదాయాలను గౌరవిస్తూ కాలుష్య రహిత, పరిశుభ్రమైన, హరిత సైబరాబాద్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.