హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి బాలలే రేపటి పౌరులు: జడ్జి భారతి

CTR: నేటి బాలలే రేపటి పౌరులని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి భారతి అన్నారు. బుధవారం చిత్తూరు నగర శివారులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు సెల్‌ఫోన్లకు దూరంగా ఉండాలని, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.