హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

RR: శంకర్‌పల్లి పోలీస్‌ స్టేషన్ పరిధిలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. భారత్ డైనమిక్స్ ఫ్యాక్టరీ సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న కారును వెనుక నుంచి బైక్ ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. చిన్న శంకర్‌పల్లి గ్రామానికి చెందిన బర్మల నిశాంత్ (19) బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన నిశాంత్‌ను సంగారెడ్డి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.