ADB: భోరజ్ మండలంలోని బాలాపూర్, హషంపూర్ గ్రామాల్లో బుధవారం మధ్యాహ్నం వర్షం కురిసింది. ఉదయం నుంచి మేఘావృతమైన వాతావరణం ఉండగా, ఒక్కసారిగా వాన పడటంతో పత్తి, సోయా పంటలు సాగు చేసిన రైతులు హర్షం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వాన ఊరటనిచ్చింది. సరైన సమయంలో కురిసిన వర్షం పంటలకు ఎంతో మేలు చేస్తుందని వారు తెలిపారు.
తెలంగాణ
VIDEO: కురిసిన వర్షంతో అన్నదాతల హర్షం


