RR: అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఇనాంగూడ బ్రిడ్జి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొనడంతో యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెలువర్తి గ్రామానికి చెందిన విద్యార్థి మారబోయిన వినయ్ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలిస్తున్నారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి


