NZB: సిరికొండ మండలం రేకులపల్లి గ్రామంలో డెంగ్యూ కేసు నమోదైన నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి ఇంటింటా జ్వర సర్వే చేపట్టారు.100 ఇళ్లను పరిశీలించగా నాలుగు నీటి పాత్రల్లో లార్వా గుర్తించి తొలగించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి సీజనల్ వ్యాధులపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్, సూపర్వైజర్ పాల్గొన్నారు.
తెలంగాణ
డెంగ్యూ నివారణ చర్యలు


