హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాగునీటి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతి

MHBD: బయ్యారం మండలం కొత్తపేటలో 15 రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ భూక్య ప్రవీణ్ నాయక్ తెలిపారు. భూ రీ-సర్వే పర్యటనకు వచ్చిన కలెక్టర్ స్నేహ శబరీష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కొత్తగా తవ్విన బోరుబావికి మోటార్, పైప్ లైన్ మంజూరు చేసి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.